పవన్ తమ్ముళ్లు వీరే…

412
Pawan Kalyan
Pawan Kalyan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ సినిమా “వీర‌మ్” ని తెలుగు లో ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేస్తున్నారని తెలిసిందే. తాజాగా ఈ సినిమా కి సంబందించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ మూవీలో పవన్ తో కలిసి శర్వానంద్, నవీన్ చంద్ర, విజయ్ దేవరకొండ నటించనున్నారు. డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో, ఈ ముగ్గురు హీరొలు పవన్ కళ్యాణ్ కి తమ్ముళ్లుగా వారు కనిపించనున్నారని సమాచారం.

Pawan Kalyan Katamarayudu Movie

అమ్మాయిలంటే నచ్చక పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఓ నడి వయసు వ్యక్తి కథ ఇది. ఐతే తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడతారు. తమ ప్రేమను అన్నయ్య అంగీకరించాలంటే.. అతడిని కూడా ప్రేమలో దించడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది.

Pawan Kalyan Katamarayudu Movie

తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవన్ ఫ్యాక్షనిస్టు పాత్ర పోషిస్తున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో పవన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించబోతున్నాడు.. ఆయన కూడా సినిమా అంతా వైట్ అండ్ వైట్లోనే దర్శనమిస్తాడట.

- Advertisement -