ప్రస్తుతం ఏపీ రాజకీయాలు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసిన పోలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. వారాహి యాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేసిన పవన్.. వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టేశారు. కానీ వైసీపీ సర్కార్ ప్రవేశ పెట్టిన వాలెంటరీ వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి తనకు తను సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. రాష్ట్రంలో వాలెంటర్ల ద్వారా భద్రత లోపం వెలువడుతోందని, ప్రజల డేటాను వాలెంటరీలు చోరీ చేస్తున్నారేనే విధంగా ఇటీవల పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే..
ఈ వ్యాఖ్యలు తీవ్ర పోలిటికల్ దుమరాన్ని రేపాయి. వైఎస్ జగన్ పాలన ఎలా ఉన్న.. ఆయన ప్రవేశ పెట్టిన వాలెంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలే ఎక్కువ జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అన్నీ పథకాలు సక్రమంగా ప్రజలకు చేరవేయడంలో వాలెంటర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అందుకే ఏపీ ప్రజలు వాలెంటరీ వ్యవస్థపై సానుకూల దృక్పథంతో ఉన్నారు. అటు టీడీపీ కూడా వాలెంటరీ వ్యవస్థపై ఆచి తూచి వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలో వాలెంటర్లను తక్కువ చేసే విధంగా పవన్ వ్యాఖ్యానించడంతో.. ఆయన వ్యాఖ్యలను ప్రదాన విమర్శనస్త్రాలుగా వాడుకునేందుకు వైసీపీ నేతలు సిద్దమయ్యారు. ఎన్నికలవేళ ఈ వ్యాఖ్యలతోనే పవన్ కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక వాలెంటర్లలలో కూడా పవన్ పై వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. దాదాపు నాలుగు లక్షల వరకు ఉన్న వాలెంటర్ల ఓటు బ్యాంకు పవన్ కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. వాలెంటరీ వ్యవస్థపై అనసవరమైన వ్యాఖ్యలు చేసి లేని సమస్యను పవన్ కొని తెచ్చుకున్నారని కొందరి విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు రోజుల్లో పవన్ వాలెంటరీ వ్యవస్థపై తన వైఖరిని ఎలా ప్రతిభింబిస్తారో చూడాలి.
Also Read:కాంగ్రెస్ కు రేవంత్ తోనే ముప్పు?