- Advertisement -
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా త్వరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్‌తో మంగళగిరి జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు దిల్ రాజు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పవన్ రావాలని దిల్ రాజు కోరడంతో జనసేనాని ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 04న రాజమండ్రిలో నిర్వహించబోతున్నట్లు సమాచారం.
Also Read:ఢిల్లీలో పీవీ మెమోరియల్: కేటీఆర్
- Advertisement -