ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు. స్పీకర్ ఎన్నిక అనంతరం మాట్లాడిన పవన్…సభలో నవ్వులు పూయించారు. అయ్యన్న పాత్రుడు చాలా సీనియర్ నేత. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత సభాపతి స్థానంలో కూర్చోవటం చాలా సంతోషంగా ఉందన్నారు.
రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడివేడిని చూశారు.. మీకు కోపం వస్తే.. రుషికొండను చెక్కినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండుకొట్టేస్తారు..అని పవన్ చెప్పగానే సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు.. కానీ, ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉందన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన సభ తీరును ఎండగడుతూ.. ప్రస్తుతం వైసీపీ సభ్యులు సభలో లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గత ఐదేళ్ల కాలంలో సభలో వ్యక్తిగత దూషణలకే పరిమితం అయ్యారు. అందుకే వాళ్లు 11 సీట్లకే పరిమితం అయ్యారు అని పవన్ చురకలు అంటించారు.
Also Read:ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న..