సినీరంగంలో మెగాస్టార్ చిరంజీవి అందించిన సేవలను గానూ యూకే పార్లమెంట్ ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ అంతా చిరుకు విషెస్ చెబుతుండగా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
యూకే పార్లమెంట్ అందించిన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో అన్నయ్య చిరంజీవి కీర్తి మరింత పెరిగిందన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్‌గా ఎదిగిన తీరు అనిర్వచనీయం అన్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అన్నారు.
చిరుకు తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను…రంజీవిని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన అన్నారు. యూకే పార్లమెంట్ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవికి, ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించిందని.. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ నవేందు మిశ్రాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పవన్.
Also Read:హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్