ఈ మధ్య రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ అనేక సభలను నిర్వహించి ప్రసంగించాడు. అయితే చాలా రోజుల తర్వాత పవన్ తన తాజా చిత్రం కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకకి హాజరు కావడం, ఈ వేడుకలో ఆయన మాట్లాడడం అందరిని ఆనందానికి గురి చేసింది. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పవన్ కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకకి పంచెకట్టుతోనే వచ్చాడు. పవన్ ని ఈ లుక్ లో చూసిన అభిమానులు తెగ మురిసిపోయారు.
కాటమరాయుడు ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వేదిక వద్దకు రాలేకపోయిన అభిమానులందరికీ క్షమాపణలు. మీ అందరి క్షేమం కోరి చిన్నస్థాయిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాను. ఇక్కడి రాలేక పోయిన మహిళలు, సోదరీమణులందరికీ మరోసారి క్షమాపణలు చెప్తున్నాను. ఏ పనైనా నిజాయితీతో పనిచేశాను. భవిష్యత్‌లో ఎలాంటి బాధ్యత అప్పగించినా నిబద్ధత, నిజాయితీతో వ్యవహరిస్తాను. ప్రజా సంక్షేమం కోసం అధికారం అంతిమ లక్ష్యం కాదు అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ మాట్లాడేంత సేపు కాబోయే సీఎం.. సీఎం అని అభిమానులు గొంతెత్తి అరిచారు.
కెరీర్ లో 20ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మనసులో దాగి ఉన్న మాటలను ఈ ఈవెంట్ లో వివరించాడు పవన్. సినిమాలో జరిగినవే తన జీవితంలో జరిగాయని అది యాదృచ్చికమో మరొకటే తెలియదంటూ చేసిన ప్రతీ సినిమాకి.. తన జీవితంలో లింక్ ఏంటో విపులీకరిస్తూ వివరించాడు. పవన్ చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. త్రివిక్రమ్ చెప్పిన మాటలు ఇప్పటికి తనకు గుర్తుండడం, తన తండ్రి మాటలను స్పూర్తి తీసుకోవడం, ఇలా ఎన్నో విషయాలపై చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు పవన్. మరి పవన్ ఫుల్ స్పీచ్ మీరు ఓ సారి చూడండి.