వేణు మాధవ్ మృతి బాధాకరంః పవన్ కళ్యాణ్

469
venupawan
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు వేణు మాధవ్ మృతిపట్ల పలువురు సినీ రాజకీయ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అందరినీ నవ్వించే వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆయన కొద్ది రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా కోలుకుంటారని తాను భావించినట్లు తెలిపారు. నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణిచడం చాలా బాధకరం.

గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పడించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు. మిమిక్రిలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరిని సరదాగా ఉంచేవారు. వర్తమాన రాజకీయ విషయాలపై ఆయన ఆసక్తి చూపేవారు. వేణు మాధవ్ మృతికి నా తరపున , జనసేనికుల తరపునా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వేణు మాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు లేఖ రాశారు పవన్ కళ్యాణ్‌. ఇక వేణు మాధవ్ మృత దేహాన్ని చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు యశోద ఆసుపత్రికి చేరకుంటున్నారు.

- Advertisement -