ఓ వైపు రాజకీయాలు, మరో వైపు వరుస సినిమాలతో చాలా బిజీ షెడ్యూల్ గడుపుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకే సారి పవన్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందుకే తన సినిమాల షూట్ పై పవన్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. నాలుగు సినిమాలకు డేట్లు ఎడ్జస్ట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మార్చి 11 నుంచి మార్చి 22 వరకూ సాయి తేజ్ తో కలిసి చేస్తున్న సినిమాకి డేట్స్ ఇచ్చాడు. అనంతరం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి డేట్స్ ఇవ్వనున్నాడు.
ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే హరిహర వీరమల్లు సినిమాకి మార్చి 24 నుంచి ఏప్రిల్ 3 వరకూ డేట్స్ ఇచ్చాడట. ఇక ఏప్రిల్ 5 నుంచి 15 వరకు హరీష్ శంకర్‌తో ఉస్తాద్ షూటింగ్లో పాల్గొననున్నాడు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగా ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఏప్రిల్ 5 నుంచి 15 వరకు జరగనుంది.
పవన్ – హరీష్ శంకర్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా షూట్ తర్వాత పది రోజులు పాటు సుజిత్ డైరక్షన్లో రానున్న ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17 నుంచి 27 వరకూ పవన్- సుజిత్ మూవీ షూటింగ్ జరగనుంది.
ఇవి కూడా చదవండి..