Bro Review:పవన్ ” బ్రో ” హిట్ కొట్టాడా?

27
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం ” బ్రో “. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మొదటి నుంచి అనుకున్నంత హైప్ లేకపోవడంతో ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవనే చెప్పాలి. దానికి తోడు ఈ మూవీ తమిళ్ హిట్ సినిమా వినిదయ సీతాం మూవీకి రీమేక్ కావడంతో పవన్ అభిమానుల్లో కూడా ఈ మూవీపై ఉండాల్సిన క్రేజ్ లేదు. ఎట్టకేలకు బ్రో మూవీ నేడు ( జూలై 28 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో షార్ట్ అండ్ స్టైట్ రివ్యూలో తెలుసుకుందాం !

కథ విషయానికొస్తే సెల్ఫిష్ గా ఉండే మార్కండేయ ( సాయి తేజ్ ) కుటుంబంపై కొంత బాద్యతరహితంగా ఉంటూ ప్రతిదీ తన స్వలాభం కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు. జాబ్ చేస్తూ సాఫీగా గడిపేస్తున్నా హీరో అనూహ్యంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అప్పుడు పైకి వెళ్లాక దేవుడి( పవన్ కల్యాణ్ )ని బ్రో అని పిలుస్తూ మంచి సన్నిహిత్యం ఏర్పరచుకొని, టాంకు భూమిమీద చాలా పనులు ఉన్నాయని, మరికొద్ది రోజులు బతికెందుకు 90 రోజులు టైమ్ కావాలని బ్రో దేవుడి వద్ద మార్కండేయ రిక్వస్ట్ చేసుకుంటాడు. ఒక కండిషన్ మీద తన కోరిక ను ఒప్పుకుందాడు బ్రో దేవుడు ( పవన్ కల్యాణ్ ). ఆ తరువాత హీరో భూమి మీదకు వచ్చి ఏం చేశాడు ? ఎలాంటి సమస్యలలో ఇరుక్కున్నడు ? బ్రో దేవుడు హీరోకు ఎలా అండగా నిలిచాడు అనేది అసలు కథ.

Also Read:TTD:మొబైల్ కంటైనర్లు

విశ్లేషణ
మోడ్రన్ దేవుడిగా పవన్ కల్యాణ్ తన పర్ఫామెన్స్ తో అదరగొట్టడానే చెప్పాలి. ముఖ్యంగా పవన్ మేనరిజాలు, ఆయన లుక్.. వింటేజ్ పవన్ ను తలపిస్తాయి. మూవీ ఫస్టాఫ్ అంతా కూడా పవన్ మరియు సాయి తేజ్ చేసే కామిడీ ఫుల్ వినిదాన్ని పంచుతుంది. ఇక సెకండాఫ్ లో కొంత సెంటిమెంట్ కు ప్రదాన్యం ఇవ్వడంతో మూవీ కొంత స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికి పవన్ స్క్రీన్ ప్రజెంట్స్ మూవీ టెంపో ను ఒకే మూడ్ లో ఉంచుతుంది. ఫైనల్ గా మూవీ చూసిన ప్రేక్షకుడు ఒక పాజిటివ్ ఫిల్ తో బయటకు వస్తాడని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ అభిమానులకు ఈ మూవీ హై ఫిస్ట్ అనే చెప్పవచ్చు.

Also Read:ఘాటు ముద్దుతో గిన్నిస్‌ బుక్‌లోకి!

- Advertisement -