కబాలిని బ్రేక్ చేసిన కాటమరాయుడు

185
Pawan Kalyan Breaks Kabali Records
- Advertisement -

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు  ఇప్పటివరకూ ఓ లెక్క.. టీజర్ వచ్చాక ఓ లెక్క అన్నట్లుగా ఉంది వ్యవహారం. నిన్నటిదాక కాటమరాయుడిని లైట్ తీసుకున్న వారందరికి షాకిచ్చాడు పవన్‌. కాటమరాయుడు టీజర్‌ విడుదలతో సీన్ అంతా మారిపోయింది. పవన్‌ సృష్టించిన ఫివర్‌తో సోషల్ మీడియాలో వైబ్రేషన్స్ క్రియేటైపోయాయి. ప్రస్తుతం కాటమరాయుడు టీజర్ యూట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండింగ్‌గా దూసుకుపోతోంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

కేవలం 2 గంటల్లోనే పది లక్షల వ్యూస్ సంపాదించి టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.  మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150  3 గంటల 5 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ సాధించగా పవన్ దానిని బ్రేక్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

అంతేకాదు సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి టీజర్ రికార్డును కూడా కాటమరాయుడు కుమ్మేశాడు. కబాలి టీజర్ కు 2 మిలియన్ల వ్యూస్ ను అందుకునేందుకు 8 గంటల సమయం పట్టగా.. కాటమరాయుడు మాత్ర కేవలం 5 గంటల 23 నిమిషాల్లోనే ఈ ఫీట్ సాధించేశాడు.దీంతో కబాలి ని మించేసిన కాటమరాయుడు అంటూ మెగా ఫాన్స్ జోరుగా ఎంజాయ్ చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన కబాలి టీజర్ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం ఒక్క పవన్ కే చెల్లిందంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు ఫ్యాన్స్‌.

- Advertisement -