అంజన్న సన్నిధిలో పవన్..

21
- Advertisement -

కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయం నుంచి ఉదయం రోడ్డు మార్గం ద్వారా పవన్ కొండగట్టుకు బయలుదేరారు. అడుగడునా పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని… జై జనసేన జై బీజేపీ జై తెలంగాణ అంటూ పవన్ కల్యాణ్ నినాదాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పవన్ కల్యాణ్ సైతం తెలంగాణలో జనసేన బలోపేతం దృష్టిసారిస్తే.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్న వాదనను జనసేన పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read:ఢిల్లీకి భారీ వర్ష సూచన:ఐఎండీ

- Advertisement -