మెగా అభిమానుల మధ్య కొన్ని నెలలుగా కోల్డ్ వార్ జరుతోంది. పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఆయన ఫ్యాన్స్ తో అల్లు అర్జున్ చెప్పడం ఈ వార్ కు తెరతీసింది. అయితే ఆ తరువాత పవన్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన బన్నీ జరిగిన దానికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టమే కానీ, ఇలా అభిమానులు అడిగిన ప్రతీసారి ఆ ఇష్టాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలన్నీ మనసులోంచి వచ్చినవేనా? లేక పవన్ ఫ్యాన్స్ ను శాంతింపజేయడానికి మాత్రమే చెప్పాడా? అంటే రెండో మాట నిజమని అంటున్నారు మెగా ఫ్యాన్స్. అప్పటి నుంచి పవన్ కల్యాణ్‌కు బన్నీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని కూడా మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె పెళ్లిలో జరిగిన సంఘటన దీనికి బాలాన్ని ఇస్తోంది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్, తండ్రి అరవింద్‌తో కలిసి అల్లు అర్జున్ వేరు వేరుగా హాజరయ్యారు.
అయితే,… పవన్, బన్నీ ఒకరికొకరు ఎదురుపడినప్పటికీ పలకరించుకోలేదని టాక్. అంతేకాక, పవన్ ఉన్న వైపు బన్నీ అస్సలు వెళ్లలేదట. పవన్‌ను పలకరించాల్సిందిగా అల్లు అరవింద్ చెప్పినా బన్ని పెడచెవిన పెట్టాడట. పవన్ ఫ్యాన్స్ బన్నీ విషయంలో అంత రచ్చ చేసినా.. ఆయన ఒక్కసారి కూడా అభిమానుల్ని హెచ్చరించలేదని అల్లు అర్జున్ భావిస్తున్నాడట. అది నచ్చకనే బన్నీ పవన్ కల్యాణ్ కు దూరమవుతున్నట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. మరీ, ఈ మెగా వార్ ఇంకా ఎంతదూరం వెళ్తుందో చూడాలి.