సింగిల్ పోస్ట్ లేకుండా 2 మిలియన్‌ ఫాలోవర్స్!

36
- Advertisement -

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ ఎక్కడుంటే అక్కడ జనమే. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు,వారాహి యాత్రతో బిజీగా ఉన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పవన్ ఇటీవలె ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ఇలా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో ఒక్క పోస్టు లేకుండానే ఏకంగా 2 మిలియన్ ఫాలోవర్స్ అంటే 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు.దీంతో సింగిల్ పోస్ట్ కూడా లేకుండా 2 మిలియన్ ఫాలోవర్స్ ని సాధించిన ఏకైక ఇండియన్ సెలెబ్రెటీగా పవన్ నిలిచాడు.

Also Read:SPY:సారీ చెప్పిన నిఖిల్

ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ తర్వాత ఓజి, హరిహర వీరమల్లు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక పవన్ – సాయి ధరమ్ నటించిన బ్రో త్వరలోనే విడుదల కానుంది.

Also Read:Salaar:ఊరమాస్ టీజర్

- Advertisement -