పవన్ కళ్యాణ్ గ్యాప్ తర్వాత ఎన్ని సినిమాలు చేస్తున్నా ఫ్యాన్స్ అందరి చూపు మాత్రం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఎనౌన్స్ అయిన ‘భవదీయుడు భగత్ సింగ్’ మీదే ఉంది. ఈ కాంబో లో వచ్చిన గబ్బర్ సింగ్ ఆ టైంలో ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చి పవన్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. అందుకే ఈసారి కూడా ఆ మేజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకంలో పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా ? అని వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని , పవన్ ఆ సినిమాను పక్కన పెట్టేశాడని ఇలా చాలా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిర్మాతలు కానీ , దర్శకుడు హరీష్ కానీ వీటిపై స్పందించలేదు. ఇక హరీష్ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
తాజాగా హరీష్ చేసిన ట్వీట్ మాత్రం పవన్ ఫ్యాన్స్ లో మళ్ళీ జోష్ నింపింది. ఇటివలే హరిహర వీరమల్లు సెట్స్ కి వెళ్ళిన హరీష్ అక్కడ క్రిష్ ఫోటో పోస్ట్ చేసి చాలా రోజుల తర్వాత పవన్ స్టార్ యాక్షన్ చూస్తున్నాని ట్వీట్ చేశాడు. దీంతో పవన్ కి హరీష్ చెడిందని, ప్రాజెక్ట్ లేదని వస్తున్న రూమర్స్ కి చెక్ పడినట్టయింది. పవన్ ను హరీష్ తన ప్రాజెక్ట్ కోసమే హరి హర వీరమల్లు సెట్స్ కి వెళ్ళాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా హరీష్ ఈ ట్సీట్ తో భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్ తప్పకుండా ఉంటుందనే సంకేతం ఇచ్చినట్టే. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతోంది ?
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్..ఇక సెల్ ఫోన్‌లోనే టీవీ!
నవంబర్ 25న…మీట్ క్యూట్ స్ట్రీమింగ్
హ్యాపీ బర్త్ డే…నయన్