కాటమరాయుడి చిత్రానికి స్వల్ప బ్రేక్ ఇచ్చిన పవన్ బుధవారం అమెరికాలో అడుగుపెట్టాడు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళిన పలు కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడపనున్నారు. పర్యటనలో భాగంగా న్యూక్లియర్ అండ్ యాంటీ న్యూక్లియర్ ప్రొఫెసర్ మాధ్యు బన్, ఎనర్జీ పాలసీ రూపకల్ప నిపుణుడు ప్రొఫెసర్ హెన్రీ లీలతో పాటు హ్యాంప్ షైర్ గవర్నర్, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు వంటి పలువురు ముఖ్యులను కలుసుకుని చర్చలు జరపనున్నారు.
పదో తేదీ ఉదయం 8 గంటలకు బోస్టన్ రాష్ట్రంలోని సీబ్రూక్ న్యూక్లియర్ ప్లాంట్ ను సందర్శించి అక్కడ నిపుణులలో మాట్లాడతారు . సుమారు రెండు గంటల సేపు పవన్ అక్కడ గడుపుతారు. 11.45 నిమిషాలకు కాన్కార్టర్ లోని హాంప్ ఫైర్ సైట్ హౌస్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు సెనేటర్లు అమెరికా న్యూక్లియర్ పాలసీ రూపకర్తలలలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సర్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రెండు తరువాత హాంప్ ఫైర్ గవర్నర్ లో బెటి అవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నార్తర్ హాంప్ ఫైర్ లోని నషువా సిటి చేరుకొని అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు తెలుగుఆడపడుచు లత మంగిపూడితో పవన్ సమావేశం జరుగుతుంది.
11 వ తేదిన హార్వర్టర్ యూనివర్సిటీ లో “బికమింగ్ జనసేనాని ” అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రికి శ్రీ పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ డిన్ నితిన్ నోట్రాయా తాజ్ బోస్టన్ లో విందు ఇస్తారు. చివరిరోజైన 12వ తేదిన (బోస్టన్ కాలమానం) హార్వర్టర్ యూనివర్సిటీలో కీనోట్ ప్రసంగం చేస్తారు. సహజంగా ఇక్కడ ఉపన్యాసకులకు అరగంట సేపు మాత్రమే సమయం కేటాయిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కు సుమారుగా గంట సమయాన్ని నిర్వాకులు కేటాయించడం గమనార్హం.
ఇక చివరి రోజు 12న నషువా లోని రివర్ యూనివర్సిటీ దగ్గర భారతీయ సంతతి వారు నిర్వహిస్తున్న కార్ ర్యాలీలోను పాల్గొంటారు. అనంతరం ఎన్ ఆర్ ఐలు ఏర్పాటు చేసిన డిన్నర్ రిసెప్షన్ సభాస్ధలికి చేరుకుంటారు. అక్కడ పూర్ణ కుంభంతో పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకనున్నారు. ఇక తెలుగు లలితా కళావైభవానికి చిహ్నమైన కూచిపూడి నృత్య ప్రదర్శనను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు బోస్టన్ నుంచి హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్ తిరుగు పయనమవుతారు.