నందమూరి బాలకృష్ణ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే వేదికపై సందడి చేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్,బాలయ్య లుక్‌కి విశేష స్పందన రాగా తాజాగా అంతేస్ధాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను పిలవాలని బాలయ్య అండ్ టీమ్ భావిస్తోందట.
ఇటీవలె వీరసింహారెడ్డి సెట్స్‌లో సందడి చేశారు పవన్. బాలయ్య – పవన్ కలిసి దిగిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా తాజాగా వీరిద్దరూ కలిసి స్టేజ్ పంచుకోనుండటం అభిమానులకు కన్నులపండగే కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇద్దరు హీరోల అభిమానులను నిజమైన సంక్రాంతి కానుంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..