పవన్ ‘పిఠాపురం’ నుంచే.. ఎందుకు ?

41
- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది గత కొన్నాళ్లుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే టీడీపీ జనసేన పార్టీలు పొత్తు కలిసిన తరువాత ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. కానీ పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై మాత్రం గత కొన్నాళ్లుగా సస్పెన్స్ సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. ఇక ఇటీవల బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత పవన్ పోటీ చేసే స్థానంపై తాజాగా క్లారిటీ వచ్చింది. తాజాగా మంగళగిరిలో నిర్వహించిన జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు..

దీంతో ఇన్నాళ్ళు పెండింగ్ లో ఉంటూ వచ్చిన పవన్ సీటు ఏదో తేలిపోయింది. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేసిన ఆయన ఆ రెండు చోట్ల కూడా ఘోర ఓటమి చవిచూశారు. దాంతో ఈసారి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతూ వచ్చింది. మొదట ఆయన భీమవరం నుంచే పోటీ చేయబోతున్నట్లు బలంగా వార్తలు వినిపించాయి. పవన్ కూడా ఒకానొక సందర్భంలో భీమవరం నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. కానీ అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకొని పిఠాపురం వైపే మొగ్గు చూపారు.

 కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాకినాడలోని పిఠాపురం కూడా ఒకటి. ఇక్కడ దాదాపు 60 శాతం కాపు ఓటర్ల పైనే గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. పవన్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకు జనసేన వైపు తిరిగే అవకాశం ఉంది. పవన్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ అని అంతర్గత సర్వేలు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే శాంతి రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. పైగా వైసీపీపై ఏర్పడ్డ వ్యతిరేకతతో ఈసారి పిఠాపురంలో ఆ పార్టీ అభ్యర్థిగా ఎవరు నిలిచిన ఓటమి తప్పదని సర్వేలు చెప్పడంతో పవన్ పిఠాపురం వైపే ఎక్కువ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి పవన్ పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ రావడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.

https://x.com/JanaSenaParty/status/1768207886134730872?s=20

Also Read:టీడీపీ రెండో జాబితా.. వారికి బిగ్ షాక్ !

- Advertisement -