పవన్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌!

353
Pawan first look poster on September 2
- Advertisement -

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌ర్వాత పవ‌న్ క‌ళ్యాణ్‌- త్రివిక్ర‌మ్ కాంబోలో ఓఓ మూవీ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ 25వ సినిమా కావడంతో ఆసక్తికర టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఇంజ‌నీర్ బాబు, రాజు వ‌చ్చినాడో అనే టైటిల్స్  టీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అందించింది చిత్ర యూనిట్.  సినిమా ఫస్ట్ లుక్‌ను పవన్ బర్త్ డే సందర్భంగా  రిలీజ్  హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్  అఫీషియల్ గా ప్రకటించింది. పీఎస్‌పీకే 25వ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆన్‌ 2 సెప్టెంబర్‌’ అని కళ్లజోడు ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ క‌థ‌నాయిక‌లుగా న‌టిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్‌ 2న  ఫస్ట్ లుక్ వస్తుండటంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ప‌వ‌న్ బ‌ర్త్ డే త‌ర్వాత చిత్ర యూనిట్ కొద్ది రోజులు యూర‌ప్ కి వెళ్ల‌నుంది.

Pawan first look poster on September 2

- Advertisement -