అజ్ఞాతవాసిపై అభిమానంతో..

235
Pawan Fan Made a Sari For Agnathavasi
- Advertisement -

భారీ అంచనాల మధ్య పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘అజ్ఞాతవాసి’ ఈరోజు విడుదలైంది. సంక్రాంతి ముందుగానే వచ్చిందా అన్నటు థియేటర్స్‌ ముందు పవన్‌ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పవర్‌స్టార్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌ సినిమా వస్తే చాలు అది హిట్టా, ఫట్టా అనే విషయాన్ని పట్టించుకోరు పవన్‌ అభిమానులు‌.

అంతే కాదు పవన్‌ కోసం ఏదైనా చేసే అభిమానం వారి సొంతం . వారి అభిమానానికి నిదర్శనం. గత కొంత కాలంగా ఫిలిం క్రిటిక్‌ కత్తి మహేష్‌ పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై పవన్ ఫ్యాన్ప్‌ పవన్‌పై ఒక్క మాట కూడా పడనివ్వట్లేదు. అందుకు సాక్ష్యం ప్రస్తుతం కత్తి మహేష్‌తో వారు చేస్తున్న మాటల యుద్ధమే. మరి పవన్‌ అంటే అంత అభిమానం..!

Pawan Fan Made a Sari For Agnathavasi

ఇక అసలు విషయానికొస్తే..‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదల సందర్భంగా.. పవన్ కల్యాణ్‌పై ప్రత్యేక అభిమానం చూపిస్తూ ప్లెక్సీలు, పాలాభిషేకాలు ఇలా చేస్తూ వారి అభిమానం చాటి చెబుతున్నారు. మరి అందరిలా చేస్తే లెక్కేం ఉంటుందని భావించినట్లున్నాడు. ధర్మవరం చెందిన చేనేత కార్మికుడు తన ప్రతిభతో పవన్ కల్యాణ్‌పై అంతులేని అభిమానంని ప్రకటించారు. ‘అజ్ఞాతవాసి’ స్టిల్స్‌తో ఆయన చేసిన శారీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్ అభిమానం గురించి చెప్పాలంటే దానికి అంతే ఉండదు.. అనేదానికి ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం విశేషం.

- Advertisement -