పవన్ ఎపిసోడ్ ఆల్ టైమ్ రికార్డు

39
- Advertisement -

బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ నేషనల్ రికార్డు సృష్టించింది. ఈ ఎపిసోడ్ ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసిన ఎపిసోడ్‌గా నిలిచి ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఈ విషయాన్ని ఆహా టీమ్ వెల్లడించింది. ”బ్లాక్ సోక్కా ఏసాడు అంటే బొమ్మ బ్లాక్ బస్టర్” అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. మొత్తానికి ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ – బాలయ్య మధ్య చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నడిచాయి.

ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌లో 3 పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ను బాలకృష్ణ ప్రశ్నించగా.. తాను అసలు బ్రహ్మచారిగా ఉండాలనుకున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యామోహంతో 3 పెళ్లిళ్లు చేసుకోలేదన్న పవన్.. తనకు రాసిపెట్టుంది కాబట్టే అలా జరిగాయని తెలిపారు. రాజకీయాల్లో ఉండడంతో తనను విమర్శించేందుకు అది ఆయుధంగా మారిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఐతే, ‘ఇన్ని పెళ్లిళ్లు నాకే జరిగాయా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది’ అంటూ పవన్ చెప్పడం ఆకట్టుకుంది.

పవన్ తన పెళ్లిళ్ల పై ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఏదీ ప్లాన్ చేయలేదు. మొదటిసారి పెళ్లి చేసుకున్నాను, ఇంట్లో చూసిన సంబంధం అది. రిలేషన్ షిప్ లో కొన్ని కుదరలేదు, అలా విడిపోయాం. రెండోసారి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. అభిప్రాయబేధాలొచ్చాయి. కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరక రేణుదేశాయ్ తో విడిపోవాల్సి వచ్చింది అని పవన్ క్లారిటీ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి…

కళాతపస్వి…’ఎస్’ లెటర్ సినిమాలు

లెజెండ్ కె.విశ్వనాథ్ మరణానికి.. కారణం అదే!

కళాతపస్వి కి ప్రముఖులు సంతాపం

- Advertisement -