జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్..

8
- Advertisement -

జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పవన్ కళ్యాణ్. మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం జరుగగా పవన్‌ని తమ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు.

ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కల్యాణ్ పేరును ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక కూటమి పొత్తులో భాగంగా పవన్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో రెండు,మూడు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీచేయగా జనసేన అభ్యర్థులు 21 నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో విజయం సాధించారు.

Also Read:‘మహారాజ’..అందరికి నచ్చుతుంది:విజయ్ సేతుపతి

- Advertisement -