సాహితీ లోకానికి తీరని లోటు: పవన్‌

336
Pawan condolences to C.Narayana Reddy
- Advertisement -

ప్రముఖ కవి, రచయిత, ఙ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి మృతిపై జనసేన అధ్యక్షుడు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సంతాపం తెలిపారు.  ఈ మేరకు ‘విశ్వంభరునికి అశ్రు నివాళి’ అంటూ ఓ ప్రకటనను విడుదల చేసిన పవన్..  తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, ఙ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ శ్రీ నారాయణ రెడ్డి మరణం తెలుగుజాతికే కాక యావత్‌ సాహితీ లోకానికి తీరని లోటు. తెలుగు పాటను కావ్య స్థాయికి తీసుకెళ్లిన ఆ మహాభావుని స్థానం భర్తీ చేయలేనిదన్నారు.

ఆయన జీవితం గురించి సినీ పెద్దల ద్వారా, కొన్ని రచనల ద్వారా తెలుసుకున్నప్పుడు శ్రీ నారాయణ రెడ్డి సదా ఆదర్శప్రాయుడు అని భావించాను. విశ్వంభర రచన ద్వారా ఙ్ఞానపీఠ్‌ అవార్డు అందుకుని తెలుగు భాష కీర్తిని విశ్వవ్యాపితం చేశారు. పద్మ శ్రీ, పద్మ భూషణ్‌, కళా ప్రపూర్ణ వంటి అనే పురస్కారాలు, రాజ్యంగ పదవులు ఆయనలోని వినమత్రను మరింత పెంచాయి. తండ్రి వ్యవసాయం చేస్తే సినారె సాహితీ వ్యవసాయం చేసి తెలుగు వారికి సాహిత్య ఫలాలను అందించారు. ఇంతటి సాహితీ స్రష్ట మరణించారని తెలిసి తీవ్ర ఆవేదన చెందాను. సినారే భౌతికంగా లేకపోయిన ఆయన వెదజల్లిన సాహిత్య సైరభాలు మన మధ్య నిరంతరంగా పరిమళిస్తూనే ఉంటాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని  తన సంతాపాన్ని తెలిపారు.

- Advertisement -