పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వినోదాయ సీతమ్ కి రీమేక్ గా తెరకెకకుతున్న ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఉండబోతుంది. ఒరిజినల్ లో హీరోయిన్ పాత్ర లేకుండా తీశారు. ఒక మధ్య వయసు మిడిల్ క్లాస్ వ్యక్తి కథతో అక్కడ సినిమా తీశారు.
తెలుగు కి వచ్చే సరికి స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా మార్పులు చేశాడు. మధ్య వయసు గల పాత్రను తొలగించి ఆ కుర్రాడి పాత్రను క్రియేట్ చేశాడు. ఆ కేరెక్టర్ నే తేజ్ చేస్తున్నాడు. ఇక సముద్రఖని చేసిన దేవుడి పాత్రను పవన్ చేస్తున్నాడు.
ఇందులో తేజ్ హీరో, పైగా పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి త్రివిక్రమ్ కొన్ని కమర్షియల్ మార్పులు చేశాడు. తేజ్ కి లవ్ ట్రాక్ పెట్టారని, ఒక సాంగ్ కూడా ఉందనుందని టాక్. అయితే హీరోయిన్ గా శ్రీ లీల ను తీసుకొని ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కొన్ని సీన్స్, ఒక సాంగ్ తో శ్రీ లీల నుండి కొన్ని డేట్స్ తీసుకొని ఆమెను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో శ్రీ లీల ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా కూడా సైన్ చేస్తే ఒకే టైంలో మెగా బ్రదర్స్ తో కలిసి నటించిన ఘనత శ్రీ లీలకి దక్కుతుంది.
ఇవి కూడా చదవండి…