ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు జనసేనాని,పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాయలసీమలోని కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
నందికొట్కూర్ నియోజకవర్గంలో ఉన్న కొణిదెల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తులతో భేటీ అయ్యారు. కొణిదెల అనేది పవన్ కళ్యాణ్ ఇంటిపేరు. తన ఇంటిపేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. పవన్ ప్రకటనతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమ నాలుగా జిల్లాలను పదేళ్లపాటు కరువు జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పారు. 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకూ నెలకు రూ.5 వేలు పింఛన్ ఇస్తామని పవన్ హామీ ఇచ్చారు.
రాయలసీమ డెవలప్‌మెంట్ కోసం రూ.50 వేల కోట్లతో ప్యాకేజీని అమలుచేస్తానని తెలిపారు. రాయలసీమకు రాకుండా చాలా మంది అడ్డుపడ్డారని పవన్ చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే కడపలో ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభిస్తామని జనసేనాని తెలిపారు. తాగు నీటి సమస్యను తీరుస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పవన్‌పై పూల వర్షం కురిపించారు.