పవన్ ” షణ్ముఖ వ్యూహం ” ఫలిస్తుందా?

35
- Advertisement -

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం టీడీపీ జనసేన చుట్టూ తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనుండడంతో ఇప్పటి నుంచే వ్యూహరచన మొదలు పెడుతున్నారు ఇరు పార్టీల అధినేతలు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉన్న వేళ జనసేన తొడవ్వడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం టీడీపీని కేసులు చుట్టుముడుతున్న వేళ కూటమిలో అధిక భారం పవన్ పైనే మోపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ కు చెక్ పెట్టేందుకు షణ్ముఖ వ్యూహం పేరుతో పవన్ ప్రణాళిక రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. .

ఈ షణ్ముఖ వ్యూహంలో ప్రధానంగా ఆరు అంశాలను హైలెట్ చేస్తున్నారట పవన్. అమరావతిని రాజధానిగా ప్రకటించడం, ఏటా లక్ష మంది యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని అందించడం, చిరు వ్యాపారులకు రూ. 10 లక్షల సాయం, ప్రణాళికతో కూడిన ఉద్యోగాల రూపకల్పన, చిన్న పరిశ్రమలకు చేయూత, సంపన్న ఏపీ పేరుతో సంపద సృష్టించడం, వంటి అంశాలను పవన్ షణ్ముఖ వ్యూహంలో ప్రతిపదిస్తున్నారట. వీనిని టీడీపీ మరియు జనసేన ఉమ్మడి మేనిఫెస్టో లో ఉండేలా పవన్ చంద్రబాబుతో కోరినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత ఎన్నికల ముందు వైఎస్ జగన్ కూడా నవరత్నాలు పేరుతో కొన్ని పథకాలను హామీలను ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా పవన్ కూడా ఇప్పుడు ఈ షణ్ముఖ వ్యూహంలోని ఆరు హామీలను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ షణ్ముఖ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Also Read:కాల్ ఆంటీ అంటున్న టబు

- Advertisement -