గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, పలు టీవీ ఛానల్లోనూ టాలీవుడ్ సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న శ్రీరెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నశ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన సీసీఎస్ పోలీసులు తగిన ఆధారాలు సేకరించి కేసు నమోదు చేయనున్నారని సిని వర్గాల సమాచారం.
తాజాగా ట్విట్టర్ వేదికగా పరోక్షంగా శేఖర్ కమ్ములపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలపై శేఖర్ కమ్ముల సీరియస్ అయ్యారు. పిచ్చిపిచ్చి కూతలు కూస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ మాటల వెనుక ఎవరున్నా.. వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే, ఇది తప్పు, నేరం, అనైతికం అంటూ శేఖర్ కమ్ముల హెచరించారు.
దీనిపై శ్రీరెడ్డి కూడా తన వాదనను గట్టిగానే వినిపించింది. చట్ట ప్రకారం వెళ్తే నాకేమైనా భయమా..? నీవు ఎవరైతే నాకేంటీ, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నాకేంటి? అంటూ ప్రశ్నించింది. తాను ఒంటరిని అయినప్పటకీ, తనకు కావాల్సినంత ధైర్యం ఉందని చెప్పింది. పోరాటానికి డబ్బు అవసరం లేదని ధైర్యం ఉంటేచాలని తెలిపింది.