- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రత్యేక హోదాకోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. మోదీ సినిమాలో పవన్, జగన్ అధ్భుతంగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్, జగన్ కుట్ర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడాలని కోరారు.
మోదీ ప్రభుత్వంపై రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ ఒత్తిడి పెంచుతుంటే.. వైకాపా హోదాకోసం పోరాటాన్ని తగ్గించిందన్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో పవన్ బాజాపాతో పొత్తు పెట్టున్నారన్న జయదేవ్… హోదాకోసం ఎన్డీయే నుంచి తెదేపా బయటకి వచ్చినప్పటికీ పవన్ ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు.
- Advertisement -