ధోనీ భాయ్‌కు రుణపడి ఉంటా!ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు రూ.18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన, తన పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై భావోద్వేగ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన పతిరన, తన క్రికెట్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన మహేంద్ర సింగ్ ధోనీకి కృతజ్ఞతలు తెలిపారు.
“నన్ను ఒక మంచి క్రికెటర్‌గా మలిచిన ధోనీ భాయ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నాపై పెట్టిన నమ్మకం, ఇచ్చిన అవకాశాలే నాకు ఈ స్థాయికి తీసుకొచ్చాయి” అని పతిరన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో గడిపిన రోజులు తన జీవితంలో మరపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని తెలిపారు. CSK అభిమానుల ప్రేమ, మద్దతు ఎప్పటికీ తన హృదయంలో ఉంటాయని చెప్పారు.
“చెన్నై నాకు ఎప్పటికీ హోమ్‌లానే ఉంటుంది. అక్కడ నేను ఒక కుటుంబంలో భాగమయ్యాను” అని భావోద్వేగంగా రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నానని, కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. KKR జట్టు మేనేజ్‌మెంట్ తనపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జట్టు కోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తానని హామీ ఇచ్చారు.
Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

