విమర్శల వలయంలో పఠాన్

795
- Advertisement -

షారుక్‌ ఖాన్‌, దీపికా పడుకోణె ప్రధాన పాత్రల్లో నటించిన ‘పఠాన్‌’ మూవీ ఇప్పటికే ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని సీన్స్, సాంగ్స్‌లోని కొన్ని విజువల్స్‌పై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం తెలిపింది. వాటిని తొలగించాలని సూచించింది. తాము చెప్పిన విధంగా మూవీలో మార్పులు చేసిన తర్వాత సెన్సార్‌ సర్టిఫికేట్‌ కోసం రమ్మని ఆదేశించింది. దీంతో ‘పఠాన్‌’ టీంకు గట్టి షాక్ తగిలినట్టైంది. అయితే, మూవీ టీమ్ ఈ షాక్ లో ఉండగా.. ఇప్పుడు అదనపు షాక్ లు తగులుతున్నాయి. ఇతర సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పఠాన్ సినిమా పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

తాజాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ షారుఖ్ ‘పఠాన్’ మూవీపై తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. మన దేశంలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంది. పఠాన్ లాంటి సినిమాను దక్షిణాది ప్రజలు ఎప్పటికీ ప్రమోట్ చేయరు. దక్షిణాది సినిమాల్లో భారతీయ సంస్కృతికి పెద్ద పీఠ వేస్తారు, కానీ బాలీవుడ్ మాత్రం భారతీయ సంస్కృతిని పదేపదే దెబ్బతీస్తుంది, కాబట్టి పఠాన్ చిత్రాన్ని బహిష్కరించాలని నిర్ణయించడం ఒక విధంగా సరైనదన్నారు.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : బికినీలో అందాల అరాచకం

ఆ భామ పై కొరటాల చూపు

ధమాకా బ్లాక్ బస్టర్ హిట్‌..

- Advertisement -