తెలుగు చలనచిత్ర ప్రేమికులకు శుభవార్త. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నందమూరి తారకరామారావు సినిమా రీ రిలీజ్ కానుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఆల్‌టైం హిట్ సినిమాల్లో ఒకటి పాతాళ భైరవి. 1951లో రిలీజ్ అయిన ఈ చిత్రం మళ్లీ రిలీజ్ కానుంది.
ఈ సినిమాకు కేవీ రెడ్డి దర్శకత్వం వహించగా ప్రముఖ నటుడు ఎస్.వి. రంగారావు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NFDC) మరియు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (NFAI), పూణే సంయుక్తంగా నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద డిజిటల్ రీస్టొరేషన్ చేశారు.
డిజిటల్‌గా రీస్టోర్ చేసిన ఈ వెర్షన్‌ను మళ్ళీ థియేటర్లలో ప్రసారం చేస్తారా? లేదా అన్నది వేచిచూడాలి. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. పింగళి నాగేంద్రరావు కథ అందించగా విజయా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు ఘంటసాల అద్భుతమైన సంగీతం అందించారు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆల్‌టైం హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
Also Read:TTD:తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

