షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో భేషరం రంగ్ సాంగ్ వివాదానికి కేరాఫ్‌గా మారింది. దీనికి తోడు దీపికా ధరించిన బికినీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బాయ్‌కాట్ పఠాన్ సినిమా ట్రెండింగ్‌లో ఉండగా తాజాగా ముస్లిం సంఘాలు సైతం తోడయ్యాయి.
బేషరం రంగ్ పాటపైనే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉలేమా బోర్డు తీవ్ర అభ్యంతరం తెలిపింది. పఠాన్లు చాలా గౌరవంగా ఉంటారని, వారిది అత్యంత గౌరవమైన సమాజమని, అయితే ఈ సినిమాలో వారిని చాలా అభ్యంతకరంగా చూపించారంటూ ఉలేమా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ చిత్రాన్ని చూడవద్దని మేము ప్రజలకు, జవాన్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా ఇస్లాంను తప్పుగా చూపిస్తే, మన మతానికి ఉన్న సరైన నిర్వచనాన్ని వెల్లడించడం మన బాధ్యత. సెన్సార్ బోర్డ్‌కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఎక్కడా ప్రదర్శించకూడదని భారతదేశంలోని అన్ని థియేటర్లకు చెప్పాలనుకుంటున్నాను అని అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీస్ అన్నారు.
ఇవి కూడా చదవండి..