పఠాన్ బాహుబలిను దాటేస్తాడా?

50
- Advertisement -

ఇరవై రోజుల తర్వాత కూడా షారుఖ్ ఖాన్ “పఠాన్” భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 16 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. “బాహుబలి 2” తర్వాత, “పఠాన్” ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ,రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ సరికొత్త చరిత్రను సృష్టించిన “బాహుబలి” మొదటి భాగం తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన “బాహుబలి 2” ఉత్తర అమెరికాలో $20 మిలియన్లను వసూలు చేసింది.

గత ఐదేళ్లలో ఇండియన్ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేయలేదు. కోవిడ్ మహమ్మారి తర్వాత, ఏ భారతీయ చిత్రం $20 మిలియన్ల మార్కును రీచ్ అవ్వలేదు. అయితే, “పఠాన్” $16 మిలియన్లు వసూలు చేసింది , మరిన్ని కలెక్షన్లు వసూళ్ళు చేస్తుంది. అయితే ఇది బాక్సాఫీస్ పరంగా “బాహుబలి 2”ని మించిపోతుందా? అనేది ఆసక్తిగా మారింది.

“పఠాన్” ఇంత దూరం వచ్చినప్పటికీ, నాలుగు మిలియన్ డాలర్లు సంపాదించడం చాలా కష్టమైన పని. రెగ్యులర్ సినీ ప్రేక్షకులు ఇప్పటికే ఈ చిత్రాన్ని చూశారు. అదనంగా, “అల వైకుంఠపురంలో” హిందీ రీమేక్, “షెహజాదా” ఈ వారాంతంలో విడుదల కానుంది. మరి షారూఖ్ ఖాన్ ఈ రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి 2′ భారతదేశం మరియు విదేశాలలో అనేక రికార్డులను సృష్టించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -