ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంలోని హే హలో.. నమస్తే హైదరాబాద్‌కు స్వాగతం అంటూ కొనసాగే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సాంగ్‌కు అందరి నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హీరో వంశీ పూజిత్ మాట్లాడుతూ అందరం కొత్తవాళ్లం నటించిన చిత్రమిది. జోస్ జిమ్మి సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పక్కా హైదరబాదీని. నేను నటిస్తున్న ఈ చిత్రంలో హైదరాబాద్ గురించి సాంగ్‌లో స్టెప్పులేయడం ఎంతో ఆనందంగా వుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా కొత్తగా వుండటంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు.
మరో కథానాయకుడు ప్రణవ్ కౌశిక్ మాట్లాడుతూ సాంగ్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ సాంగ్‌లో హైదరాబాద్ లైఫ్, వైబ్ వుంది. ఈ సినిమాకు కథే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. యూత్ ఎనర్జీతో కొనసాగే ఈ పాట ఆట సందీప్ కొరియోగ్రఫీ, శ్రీమణి సాహిత్యం ఎంతో బలానిచ్చాయి. పాట వింటూంటే అందరిలో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. తప్పకుండా మా పతంగ్ చిత్రం అన్నివర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది అని తెలిపారు. శ్రీమణి మాట్లాడుతూ అందరం కలిసి చేసిన కొత్త ప్రయత్నమిది. ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంతో ప్రతిభ గల సంగీత దర్శకుడు. ఈ సినిమా అందరికి మంచి పేరును తీసుకవస్తుంది అన్నారు. ఓ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయాలంటే మంచి ట్యూన్‌తో పాటు ఆకట్టుకునే లిరిక్స్ కావాలి. అలాంటి జోష్ ఈ సాంగ్‌లో వుంది. అందుకే మంచి స్టెప్స్ కుదిరాయి. ఈ పాటను శంకర్ మహాదేవన్ చాలా అద్బుతంగా పాడారు అన్నారు. నా ప్రతిభ నిరూపించుకోవడానికి ఈ సినిమా మంచి అవకాశంగా భావిస్తున్నానని సంగీత దర్శకుడు జోస్ జిమ్మి తెలిపారు. ఈ సమావేశంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాని బండ్రెడ్డి, హీరోయిన్ ప్రీతి పగడాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిఖిల్ కోడూరు, దర్శకుడు ప్రణీత్, కాస్ట్యూమ్ డిజైనర్: మేఘన తదితరులు పాల్గొన్నారు.
Also Read:Kavitha:కవిత అరెస్ట్ వెనుక..పెద్ద కుట్రే?