Aus:ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత..

7
- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. డే–4 ప్రారంభ దశలోనే రెండు కీలక వికెట్లు తీసిన కమిన్స్, మాజీ పాకిస్థాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సరసన చోటు దక్కించుకున్నాడు. టెస్టు కెప్టెన్‌గా 150కు పైగా వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా కమిన్స్ రికార్డు సృష్టించాడు.

2025–26 యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 435 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను కమిన్స్ ఆరంభంలోనే దెబ్బతీశాడు. బెన్ డకెట్, ఒల్లీ పోప్‌లను పెవిలియన్‌కు పంపించి ఆసీస్‌కు కలల ఆరంభం అందించాడు.

ఈ రెండు వికెట్లతోనే కమిన్స్ టెస్టు కెప్టెన్‌గా 150 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా నిలిచి, ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపును చాటుకున్నాడు.

Also Read:శ్రీశైలంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్

- Advertisement -