పసివాడి ప్రాణం…ఫస్ట్ లుక్

354
pasiwadi pranam firstlook
- Advertisement -

ధన్ శ్రీ ఆర్ట్స్ నిర్మిస్తున్న పసివాడి ప్రాణం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. మా విన్నపాన్ని మన్నించి సినిమా టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేసిన డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత.

టాలీవుడ్లో ఇంతవరకూరానటువంటి వినుత్నమైన “లైవ్ కం యానిమేషన్” చిత్రం “పసివాడి ప్రాణం”. మోషన్ కాప్చర్, యానిమేషన్, గ్రాఫిక్స్‌ టెక్నాలజీలతో నిర్మితమైన 3D మరియు2D కేరెక్టర్స్ మిగిలిన నటీనటులతో పోటిగా ప్రేక్షకులనుమెప్పించటం ఈ సినిమా ప్రత్యేకత.

“పసివాడి ప్రాణం” 90స్ లో మెగాస్టార్ చిరంజీవిగారు నటించిన సూపర్ హిట్ సినిమా పేరు మా సినిమా పేరు ఒకటే కావటం యాద్రుచ్చికం. కానీ ఆ సినిమాలో పసివాడిగా నటించి మెప్పించిన,ఈనాటి బుల్లితెర వదినమ్మ ఫేం‘సుజిత’ ఈ సినిమాలో అతిముఖ్యమైన తల్లిపాత్రలో అద్భుతంగా నటించారు.

అల్లువారి వంశంనుండి వచ్చిన యువకుడు “అల్లు వంశీ”ని హీరోగా పరిచయం చేస్తున్నాం. అల్లు వంశీ సరసన జంటగా దక్షిణాది తార ‘ఇతి ఆచార్య’ను తెలుగుతెరకి పరిచయం చేస్తున్నాం.ఈ సినిమాలో మరికొన్ని ముఖ పాత్రలలో సాయి, యోగి,రుబినా, FM బాబాయ్ నటించారు.ఈ సినిమాకి కథ ప్రాణమైతే ఉపిరి CG వర్క్. మోషన్ కాప్చర్, 3D మరియు2D ఏనిమేషన్, గ్రాఫిక్స్ విశాఖపట్నం” Imagicans” సంస్థ చేసింది. మొకేప్ స్పెషలిస్టులు విజయ్, సుమన్, Imagicans శేషగిరిగారికి ప్రత్యక ధన్యవాదములు అని అన్నారు . దర్సక నిర్మాత మూర్తి .

సాంకేతికవర్గం: కెమెరా K.బుజ్జి; సంగీతం-G.J.కార్తికేయన్; PRO : వీరబాబు కొరియోగ్రఫీ- చార్లీ; ఫైట్స్- కుంగ్ ఫూ శేఖర్; స్టొరీ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్ N.S.మూర్తి.

- Advertisement -