పరువు కోసం నాగబాబు!

10
- Advertisement -

నగేష్ అగస్త్య, నివేతా పేతురాజ్ జంటగా నటించిన వెబ్ సిరీస్ పరువు. ఈ సిరీస్ కు సిద్దార్థ్, రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. గోల్డెన్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. నాగబాబు కీలక పాత్రలో పోషించగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ ట్రైలర్లో పరువు కోసం ఏదైనా చేయడానికి సిద్దపడే పెద్ద మనిషిగా నాగబాబు కనిపించాడు. నగేష్ అగస్త్య, నివేతా పేతురాజ్ ప్రేమించుకుంటారు. ఇంట్లో ఒప్పుకోరని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకొంటారు. వారిని చంపడానికి నాగబాబు ఒకపక్క, పోలీసులు ఇంకోపక్క తిరుగుతో ఉంటారు. సీన్ కట్ చేస్తే నాగబాబు పరువు ఎలా పోయింది.. ? అసలు చనిపోయింది ఎవరు.. ? అన్న సస్పెన్స్‌ను ఉంచారు. జీ5 లో జూన్ 14 నుంచి పరువు స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -