గీతాగోవిందం దర్శకుడితో బాలయ్య!

91
nbk
- Advertisement -

NBk..ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతున్న పేరు. అఖండ తర్వాత బాలయ్య రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయనతో సినిమా తీసెందుకు దర్శకులు పోటీపడుతున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య..తన 109వ చిత్రాన్ని గీతాగోవిందం ఫేమ్ పరశురామ్‌తో తీయనున్నట్లు తెలుస్తోంది.

అల్లు శిరీష్‌ హీరోగా నటించిన ‘ఊర్వశివో.. రాక్షసివో’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన బాలయ్య… మీ తదుపరి చిత్రంలో నటించే అవకాశం ఇస్తారా? మీ పక్కన నుంచి డైలాగ్‌ చెప్పే సీన్‌ ఉంటే చాలు అని శిరీష్ అడగ్గా నెక్ట్స్‌ పరశురామ్‌ సినిమాలో ట్రై చేద్దాం. క్యారెక్టర్‌ ఏంటనేది సిట్టింగ్‌లో ప్లాన్‌ చేద్దాం అని తెలిపారు.

దీంతో బాలయ్య తన నెక్ట్స్ చిత్రం పరశురామ్‌తో ఉండనుందని తెలుస్తోంది. ఇక ఇదే ఫంక్షన్‌కు వచ్చిన పరశురామ్‌ త్వరలోనే ఓ కథతో మిమ్మల్ని కలుస్తా. ఈ విషయం అల్లు అరవింద్‌ కి కూడా తెలుసు అని చెప్పి నిర్మాత అల్లు అరవింద్‌ అని చెప్పకనే చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి..

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. రెండో ఆడియో లీక్

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆడియో వైరల్

కృష్ణా బోర్డు దండగ

- Advertisement -