ఎఫ్‌3పై పరుచూరి మార్క్ కామెంట్!

54
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. కలెక్షన్స్ వచ్చినా సినిమాపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు పరుచూరి గోపాలకృష్ణ.

వెంకటేష్ ని మురళి శర్మ కొడుకుగా చుపించాలనుకోవడం పెద్ద పొరపాటు, వెంకటేష్ వయసు ఎంతో మనకి తెలుసు అలాంటిది అలా ఎలా చుపించారో. సాధారణంగా వెంకటేష్ ఇలాంటి స్టుపిడ్ కథలని ఒప్పుకోరు. కానీ ఈ సినిమాకి ఎందుకు ఓకే చెప్పారో అర్థం కావడం లేదన్నారు.

తమన్నాకి మీసాలు పెట్టి అబ్బాయిలాగా చూపించడం లాంటివి ఏమాత్రం సెట్ అవ్వలేదు. ఎఫ్2 లో భార్య, భర్తల మధ్య ఉండే సాధారణ సమస్యలని ఫన్నీగా చూపించారు. ఆ మూవీలో ఒక సోల్ ఉంది. కానీ ఈ చిత్రంలో అంతా డబ్బు చుట్టూ చూపించారు. ఈ సినిమా వసూళ్లు సాధించింది అంటే అందుకు కారణం చివరి 20 నిమిషాలే అన్నారు. మరి దీనిపై వెంకీ, అనిల్ రావిపూడి ఎలా స్పందిస్తారో వేచిచూడాలి..

- Advertisement -