వామ్మో ‘ప్యారెట్ ఫీవర్’.. జాగ్రత్త!

17
- Advertisement -

నేటి రోజుల్లో రోజుకో కొత్తరకం వ్యాధులు పుట్టుకొస్తూ మానవులకు పెను సవాల్ విసురుతున్నాయి. గత ఐదేళ్లలో చాలానే కొత్తరకం వ్యాధులు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా కరోనా వైరస్ సృష్టించిన విలయం ఎవరు అంతా తేలికగా మర్చిపోలేరు. ప్రస్తుతం ఆ రేంజ్ వ్యాధులు బహిర్గతం కాకపోయినప్పటికి.. అడపా దడప అక్కడక్కడ కొన్ని వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. అ మద్య మంకీ ఫీవర్ కొంత కలవర పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం యూరప్ దేశాలలో మరో కొత్తరకం వ్యాధి ” ప్యారెట్ ఫీవర్ ” కలవరపెడుతోంది. ఈ వ్యాధి పక్షుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చిలుకలు, కోళ్ళు, ఇతరత్రా పక్షుల మలంలోని ‘క్లామీడియా పిట్టాసి’ అనే బ్యాక్టీరియా మనుషుల శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్యారెట్ ఫీవర్ వ్యాధి వస్తుందట..

పక్షుల నుంచి వచ్చే ధూళి కణాలు, మలం యొక్క వాసన వంటివి పీల్చినప్పుడు గాలి ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ వ్యాధి సోకిన వారిలో కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, జ్వరం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయట. ఈ లక్షణాలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ వ్యాధి విషయంలో కొంత అప్రమత్తంగానే ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. పెంపుడు పక్షులు పెంచుకునే వారు, కోళ్ళ ఫారంలో పని చేసేవారు ఈ ప్యారెట్ ఫీవర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పౌల్ట్రీ ఫారంలో పని చేసే వారు తప్పనిసరిగా మస్కూలు ఉపయోగించాలి. కోళ్ళను పట్టుకునే టప్పుడు చేతులకు గ్లౌజ్ లను ధరించాలి. తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవడం, శానిటైజర్ రాసుకోవడం చేయాలి. ఏదైనా వ్యాధి బారిన పడిన కోళ్ళకు లేదా పక్షులకు సాధ్యమైనంత వరకు దూరం పాటించాలి.

Also Read:రోహిత్ vs పాండ్య.. ముదురుతున్న వివాదం!

- Advertisement -