‘ఆటా’ అధ్యక్షుడిగా పరమేశ్ భీంరెడ్డి..

280
Parmesh Bheemreddy
- Advertisement -

అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) నూతన అధ్యక్షుడిగా పరమేశ్ భీంరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జ‌న్మించారు, తండ్రి పేరు భీంరెడ్డి కొండా రెడ్డి. పరమేశ్ భీంరెడ్డి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 1991లో ఉన్నత విద్యనభ్యసించడానికి అమెరికాకు వెళ్లి న్యూయార్క్‌లో విద్యాభ్యాసం కొనసాగించారు. వృత్తిరీత్యా కంప్యూటర్ ఇంజనీర్ అయినా పరమేష్ భీంరెడ్డి, సాఫ్ట్ వేర్ వ్యాపారాన్ని స్థాపించి ఇక్కడి వారెందరికో అమెరికాలో స్థిర పడడానికి సహాయ పడ్డారు. వారందరుకూడా ఇప్పుడు పెద్ద పెద్ద హోదాల్లో కోనసాగుతున్నారు.

పరమేష్ భీంరెడ్డి భార్య స్వర్ణ వృత్తి రీత్యా వైద్యురాలు. ఆమె ప్రముఖ కార్డియాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అమెరికాలోని తెలుగువారిని ఐక్య చేస్తూ పలు పదవులు నిర్వర్తించారు. 1992లో ఆటాలో చేరిన పరమేశ్డ్ భీంరెడ్డి పలు హోదాల్లో పనిచేశారు, ప్రముఖంగా 12వ సదస్సుకు కార్య దర్శిగా, 13వ సదస్సుకు సమన్వయకర్తగా చెప్పుకోడదగ్గవి. భీంరెడ్డి ఇతర పాలమూర్ ఎన్నారైలతో కలిసి పాలమూరు ఎన్నారై ఫోరం స్థాపించి అనేక కార్యక్రమాలు పాలమూర్ జిల్లాలో చేపట్టారు. 2017 సంవత్సరంలో ఆటా అధ్యక్షుడు గా ఎన్నుకోబడి, జనవరి 19, 2019న పరమేశ్డ్ భీంరెడ్డి ఆటా నూతన అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Parmesh Bheemreddy

అమెరికా తెలుగు సంఘం(ఆటా): అమెరికాలో తెలుగు సంతతి ప్రజల కోసం దాదాపు 30 సంవత్సరాల క్రింద స్థాపించిన సంఘం. తెలుగు సాహితీ, సంస్కృతి, విద్య,ఆరోగ్య, వ్యాపార ,ధార్మిక, సాంఘిక, సామాజిక కార్యకలాపాలను చేపడుతూ జాతీయ స్థాయిలో తన వంతు సేవలు అందిస్తోంది. అమెరికాలో తెలుగు సంతతి ప్రజల కోసం స్థాపించిన ఈ సంఘం విదేశాల్లోనూ తెలుగు ఖ్యాతిని పరిరక్షించేందుకు పని చేస్తోంది.

అమెరికా, భారత్ లలోని తెలుగు సంతతి విద్యార్థులు, శాస్త్రవేత్తలు, వృత్తి విద్యా నిపుణులు కలసి అభిప్రాయాలు పంచుకునేలా మిలియన్ల డాలర్లు వెచ్చించి ప్రతి రెండేళ్లకోసారి అమెరికాలోని వివిధ ప్రధాన నగరాలలో పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహిస్తోంది. అమెరికాలో నిర్వహించే కార్యక్రమాలకు తెలుగు పండితులు, కళాకారులు, వృత్తి కళాకారులు, వ్యాపారవేత్తలు ,రాజకీయ నేతలను రప్పించి, వారిచే ఉపన్యాసాలు, ప్రదర్శనలు ఇప్పిస్తోంది.

- Advertisement -