సహకరించండి..విపక్షాలకు మోడీ సూచన

213
modi
- Advertisement -

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. జూలై 18 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 18 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అయితే అంతా ఉహించనట్టుగానే ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం ముందు నిరసన వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని…విపక్షాలు సహకరించాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సమస్య ఏదైనా వాటిపై చర్చించేందుకు సిద్ధమని అనుభవజ్ఞులైన సభ్యులు సలహాలు,సూచనలు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. సభా సమయాన్ని వృథా చేయవద్దని కోరారు.

ఈ సమావేశాల్లో మొత్తం 46 బిల్లులు, రెండు ఆర్థిక అంశాలు చర్చకు రానున్నాయి. గత రెండు సెషన్ల నుంచి పెండింగ్‌లో ఉన్న త్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేయించే పట్టుదలతో ఉంది కేంద్రం.దీంతో పాటు ఎయిర్ పోర్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టసవరణ బిల్లు, నియంత్రణ లేని డిపాజిట్ స్కీంల నిషేద బిల్లు, సీజీఎస్టీ,ఐజీఎస్టీ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది.

- Advertisement -