పార్లమెంట్ ఎన్నికల్లో “తారకమంత్రం”

286
ktr new
- Advertisement -

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన 16లోక్ సభ స్ధానాలను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది టీఆర్ఎస్ అధిష్టానం. ఇందుకోసం తగిన కార్యచరణను రూపొందించారు గులాబీ బాస్ సీఎం కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రంగంలోకి దింపారు. నియోజకవర్గాల వారిగా పార్లమెంట్ సన్నాహాక సమావేశాలను నిర్వహిస్తున్నారు. రొజుకు రెండు పార్లమెంట్ స్ధానాలలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో కేటీఆర్ మాట్లాడనున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 16స్ధానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. నిన్న కరీంనగర్ లో మొదటి సభను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

నేడు ఉమ్మడి వరంగల్, భువనగిరి పార్లమెంట్ స్ధానాల్లోని బహిరంగ సభల్లో కేటీఆర్ పాల్గోననున్నారు. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల సక్సెస్ ఫార్మూలాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లు సాధించింది. గ్రేటర్ ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరించి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు కేటీఆర్. కేవలం ఒకే ఒక బహిరంగ సభలో మాత్రమే సీఎం కేసీఆర్ హాజరయ్యి ప్రసగించారు.

తాజాగా లోక్ సభ ఎన్నికల్లో కూడా గ్రేటర్ వ్యూహాన్ని అమలు చేస్తుంది టీఆర్ఎస్ నాయకత్వం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా టీఆర్ఎస్ తరపున కేటీఆర్ మాత్రమే పాల్గోంటారని సమాచారం. చివర్లో జరగబోయే భారీ బహిరంగ సభలో మాత్రమే కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తుంది. గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల భాద్యతలు చేపట్టి విజయం సాధించిన కేటీఆర్..ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏమేరకు విజయం సాధిస్తారో చూడాలి.

- Advertisement -