అందుకే సైలెంట్‌గా కానిచ్చేశారు..

248
- Advertisement -

మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో త‌న‌ని తాను ప్రూవ్‌ చేసుకున్నాడు కొర‌టాల శివ‌. ఇక శ్రీమంతుడు తర్వాత మరోసారి సూపర్ స్టార్ ప్రిన్స్‌తో కొరటాల మరో సినిమా తెరకెక్కించనున్నాడన్న విషయం తెలిసిందే.

దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే స్టార్ట్‌ అయ్యాయి. ఇదిలా ఉంటే..మే నెల నుంచి కొరటాల శివతో ‘భరత్ అను నేను’ పేరుతో కొత్త సినిమా స్టార్ట్‌ చేయనున్నాడు మహేష్.
  Parineeti Chopra to charge a bombing amount in Mahesh's next
ఆ తర్వాత వంశీ పైడిపల్లితో కూడా మూవీ చేసేందుకు ఓకే చేశాడు సూపర్ స్టార్. ఇదిలా ఉంటే.. కొరటాల సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్‌ ఎవరికి ఇవ్వాలనే మ్యాటర్‌ పై ఫైనల్ డెషీషన్‌కి వచ్చేశాడట కొరటాల శివ.

అయితే ఎం.ఎస్.ధోనితో ఆడియెన్స్‌ ను అట్రాక్ట్ చేసిన కియరా అద్వాని మహేష్ కు సెట్‌ చెయ్యాలని డిసైడైపోయాడట. దీంతో ప్రిన్స్‌ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది కియరా. నిజానికి పరిణీతి చోప్రాను ఈ సినిమాలలో హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ..బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ ఉన్న భామలు ఆఫర్లు లేకపోయినా.. ఖాళీగానైనా ఉంటారేమో గానీ.. సౌత్ లో ఆఫర్ వస్తే మాత్రం ఆకాశాన్నంటే రెమ్యునరేషన్ చెప్పేస్తారు.
  Parineeti Chopra to charge a bombing amount in Mahesh's next
ఈ క్రమంలోనే పరిణీతి చోప్రా కూడా మహేష్ తో చేయాలంటే మూడు కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. ప్రస్తుతం పరిణీతి అంత ఫాంలో కూడా లేదు. అందుకే సైలెంట్‌గా పరిణీతిని పక్కన పెట్టి..కియరా అద్వానిని 50 లక్షలకే ఓకే చేశారట.

ప్రస్తుతం మురుగదాస్ స్పైడర్ పూర్తి కాగానే కొరటాల శివ సినిమా చేయనున్నాడు మహేష్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న కొరటాల మూవీ మరో శ్రీమంతుడు అవుతుందని అంటున్నారు. సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తాడట. మరి అదిరిపోయే కథతో వస్తున్న ఈ ‘భరత్ అనే నేను’ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -