ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం పరిచయం. జులై 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. డైరెక్టర్ మారుతి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ…
“పరిచయం” మూవీ కి సపోర్ట్ చేసినందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన నాని, శర్వానంద్, సాయి పల్లవి, హరీష్ శంకర్, డైరెక్టర్ మారుతి గారికి రుణపడి ఉంటాం. ఈ చిత్రం లవ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి స్ట్రాంగ్ ఎమోషన్ గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది” అన్నారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ…
“పరిచయం టైటిల్ బాగుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వస్తున్న ఈ చిత్ర యూనిట్ కు మంచి విజయం రావాలని కోరుకుంటున్నా. ఆర్టిస్ట్ పృథ్వి గారు ఈ సినిమాతో వచ్చారు. ఎనర్జిటిక్ ఆర్టిస్ట్ అతను. సినిమాను టీం వర్క్ తో చేశారు. ఈ సినిమా మొదటిరోజు చూస్తాను. హీరో, హీరోయిన్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను”అన్నారు.
హీరో విరాట్ కొండూరు మాట్లాడుతూ..
“7, 8 ఏళ్లుగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా. ఈ సినిమాతో నా కల నెరవేరింది. తొలి అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రొత్సహించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. జులై 21న మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి” అన్నారు.
ఆర్టిస్ట్ పృథ్వీ మాట్లాడుతూ…
“నటుడిగా నాకిది 123వ సినిమా. అయినప్పటికీ అందరూ నన్ను ‘పెళ్ళి’ పృథ్వీ అనే పిలుస్తుంటారు. 7 ఏళ్ళ తరువాత నేను నటిస్తున్న తెలుగు చిత్రమిది. ఇందులో హీరోయిన్ ఫాదర్‌గా నటించా. ముఖ్యంగా రెండు సన్నివేశాలు నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. రేపు సినిమా చూస్తున్నప్పుడు తప్పకుండా ఆ సన్నివేశాలు మీకు నచ్చుతాయన్న నమ్మకం ఉంది. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి దర్శకుల శైలిలో లక్ష్మీకాంత్ చెన్నా పనితనం ఉంది. కులుమనాలి, వైజాగ్, అరకు వంటి అందమైన ప్రదేశాల్లో తీసిన సన్నివేశాలు కంటికింపుగా ఉంటాయి. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది” అన్నారు.
నిర్మాత రియాజ్ మాట్లాడుతూ…
“దర్శకుడు లక్ష్మీకాంత్‌కథకు తగ్గ వాతావరణం ఉండేలా చూసుకుని సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. లాస్ట్ మంత్ ఫస్ట్ కాపీ చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఓ మంచి సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగుతున్నందుకు సంతోషంగా ఉంది. అంతర్లీనంగా మంచి సందేశం ఉన్న ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమా నిర్మాణ సమయంలో బెక్కెం వేణుగోపాల్ అందించిన సహకారం మరువలేనిది. మా టీమ్ అంతా తామే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాము అన్నంతగా కష్టపడి పనిచేశారు. అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది” అన్నారు.
నటీనటులు: విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్, రాజీవ్ కనకాల, పృథ్వి, సిజ్జు, పరుచూరి వెంకటేశ్వరరావు, రాహుల్ రామకృష్ణ, శివన్నారాయణ, పద్మజ లంక
సాంకేతిక నిపుణులు: రచన దర్సకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా, నిర్మాత: రియాజ్ ,మ్యూజిక్: శేఖర్ చంద్ర, లిరిక్స్: భాస్కరభట్ల,వనమాలి,శ్రీమణీ, డైలాగ్స్: సాగర్, సినిమాటోగ్రఫీ: నరేష్ రానా
కోరియోగ్రఫీ: విజయ్ ప్రకాష్, హరికిరణ్, ఫైట్స్: రామకృష్ణ, చీఫ్ కో డైరెక్టర్: సత్యం కల్వకోలు, ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, పి ఆర్ ఓ:వంశీ శేఖర్, ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్