ఎన్టీఆర్‌ బయోపిక్‌లో లింగం మామ..!

272
- Advertisement -

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య 64 పాత్రలలో కనిపించనున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి మాటలు అందించిన బుర్ర సాయిమాధవ్ ఈ చిత్రానికి మాటలు అందిస్తుండగా ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. కీర‌వాణి చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా, సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేయ‌నున్నారు.

ఈ చిత్ర నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా తాజాగా ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో లింగం మామగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన పరేష్ రావల్ ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించనున్నాడు. ఎన్టీఆర్ పార్టీ స్ధాపించడం తర్వాత జరిగిన పరిణామాలు బయోపిక్‌లో ఉండనుండగా ఈ సినిమాలో పరేష్ రావల్ నాదెండ్ల భాస్కరరావు పాత్ర పోషించనున్నాడట. ప‌లువురు న‌టుల‌ని నాదెండ్ల పాత్ర కోసం ప‌రిశీలించిన చివ‌రికి ప‌రేష్ వైపే టీం మొగ్గు చూపించింద‌ట‌.

ఈ సినిమాతో బాలకృష్ణ నిర్మాతగా మారనుండగా…క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి కూడా ప్రధానపాత్రలో నటించనుందట.

- Advertisement -