బుల్లితెర హాస్యనటుడు, జబర్దస్త్ ఫేమ్ వినోద్ కిడ్నాప్ ఉదంతం కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. వినోద్ కిడ్నాప్ అయ్యాడని, ఆత్మహత్యాయత్నం చేశాడంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది.ఇంతకీ వినోద్ ఘటనలో ఏం జరిగిందంటే .. మహిళా పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వినోద్ స్వస్థలం వైఎస్సార్ జిల్లా. ఇతని తల్లి శిరోమణమ్మ సోదరి లక్ష్మమ్మ కర్నూలు జిల్లా సంజామల మండలంలోని బొందలదిన్నెలో నివాసం ఉంటోంది.
లక్ష్మమ్మ కుమార్తె, అల్లుడు చనిపోవడంతో పెళ్లీడుకొచ్చిన మనవరాలు అనాథగా మిగిలింది. ఆ దంపతుల కుమార్తె ఆలనాపాలన లక్ష్మమ్మ చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈమెను వినోద్‌కు ఇచ్చి వివాహం చేయాలని బంధువులు భావించారు. అతనితో చర్చించగా నిర్ణయం వేరుగా ఉండటంతో బలవంతంగానైనా పెళ్లి చేయాలనుకున్నారు.ఆదివారం రాత్రి వినోద్‌ను కిడ్నాప్ చేసి బొందలదిన్నెకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పెనుగులాటలో వినోద్ కుడి చేయికి స్వల్ప గాయమైంది. సోమవారం ఉదయం అక్క కూతురితో పెళ్లి చేయడానికి ప్రయత్నించగా నిరాకరించాడు.
ఇంతలో కిడ్నాప్ చేశారని సమాచారం అందడంతో సంజామల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వినోద్‌తోపాటు బంధువులను పోలీసుస్టేషన్‌కు తరలించారు.అంతేకానీ, అతను ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలుస్తోంది. ఇక కుటుంబ సభ్యులే అతనిని బలవంతం చేయడంతో కిడ్నాప్ కూడా జరగలేదు. ఇంతలో కిడ్నాప్ అంటూ పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనాస్థలికి చేరుకోగా… తననెవరూ కిడ్నాప్ చేయలేదని, ఆత్మహత్యాయత్నం కూడా చేయలేదని వినోద్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్ కు చేరడంతో వివాదం ముగిసింది.