సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలో విడుదలైన తమిళ సినిమా ‘పరాశక్తి’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన తర్వాత ఈ చిత్రానికి మెరుగైన స్పందన లభించింది.
ఫిబ్రవరి 7, 2026న ZEE5లో పలు భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా, తక్కువ సమయంలోనే విశేషమైన మైలురాయిని సాధించింది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.
సుధాకర్ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్, శ్రీలీల, అథర్వ, రవి మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
Also Read:రెండేళ్లలో రేవంత్ చేసింది శూన్యం:కేటీఆర్

