పారదర్శకంగా అసెంబ్లీ సమావేశాలు…

62
- Advertisement -

ఈ యేడాది తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈనెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, మండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, లెజిస్లేటివ్‌ సెక్రెటరీ నరసింహాచార్యులు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు రామకృష్ణారావు, అరవింద కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ కుమార్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్‌, హైదరాబాద్ సిటీ పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్‌, రాచకొండ కమిషనర్ డీఎస్‌ చౌహన్, సైబరాబాద్ కమిషనర్‌ స్టిఫెన్‌ రవీంద్ర, అసెంబ్లీ చీఫ్‌ మార్షల్ కరుణాకర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ…తెలంగాణ శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉందన్నారు. శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. శాసనసభ పరిసరాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు.

మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం పేదల సంక్షేమానికి అద్భుతమైన పథకాలను అమలు చేస్తోందన్న ఆయన.. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వానికి పేరును తీసుకువస్తున్నారన్నారు. శాసనసభ సమావేశాల కోసం పాస్‌లు జారీ చేయాలని, పాస్‌లు ఉన్న వారినే అనుమతించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి…

కేంద్ర వార్షిక బడ్జెట్… హైలైట్స్

దేశంలోనే నెంబర్‌వన్..కేజీ టూ పీజీ

ఈ సారి రక్షణ బడ్జెట్‌ పెంపు…

- Advertisement -