పేపర్ బాయ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ అంతా వచ్చారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావ్ ఈ చిత్ర ట్రైలర్ చూసి అభినందించారు. సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ.. ముందుగా నాకు జీవితం ఇచ్చిన సంపత్ నందికి కృతజ్ఞతలు. ఈ సినిమాకు ఆత్మ ఆయనే. ఇక మీడియా పర్సన్ సురేష్ ఉపాధ్యాయ్ ఈ చిత్రంలో మూడు పాటలు రాశాడు. చిన్న సినిమా ఇది.. అంతా ఆదరిస్తారని నమ్ముతున్నాను అన్నారు.
హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ.. సంతపకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాలో ధరణి పాత్రలో నటించాను. ఇది నాకు చాలా ప్రత్యేకం. ఈ పాత్ర కోసం నన్ను నమ్మినందుకు దర్శకుడు జయశంకర్‌కి కూడా థ్యాంక్స్. డివోపి సౌందర్ రాజన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. పేపర్ బాయ్ అందరికి ఫస్ట్ లవ్‌ను గుర్తు చేసే మంచి ప్రేమకథ. అందరూ సెప్టెంబర్ 7న థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా.. అన్నారు.
హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. సంపత్‌తో పని చేయడం నాకు ప్రత్యేకం.. ఇది చాలా ప్రత్యేకమైన అనుభవం కూడా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాములు, వెంకట్, నరసింహాకు మనస్పూర్థిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సెప్టెంబర్ 7న విడుదల కానున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆశీర్వదించి.. ఆదరిస్తారని కోరుకుంటున్నాని చెప్పారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడైతే కథ విన్నానో.. వెంటనే దాంతో కనెక్ట్ అయిపోయాను. ఈ విషయంలో నన్ను నమ్మినందుకు సంపత్ నందికి థ్యాంక్ యూ అన్నారు.
దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. ముందుగా ఈ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి వచ్చినందుకు మీడియా వాళ్లందరికీ థ్యాంక్ యూ. టీజర్‌కు 36 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. మేం మంచి సినిమానే తీసాం అని గట్టిగా నమ్ముతున్నాం. పేపర్ బాయ్ మంచి ప్రేమకథ. ఈ సినిమాలో నాకు తోడుగా ఉన్న రాములు, వెంకట్, నరసింహాకు థ్యాంక్స్. వాళ్లే ఈ సినిమాకు వెన్నుముకలా నిలబడ్డారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. మా సినిమా తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నటీనటులు: సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్యా హోప్.. సాంకేతిక నిపుణులు: దర్శకుడు: జయశంకర్, నిర్మాతలు: సంపత్ నంది, రాములు, తాన్యా హోప్, బ్యానర్స్: సంపత్ నంది టీమ్ వర్క్స్… బిఎల్ఎన్ సినిమాస్.. ప్రచిత్ర క్రియేషన్స్, సంగీతం: భీమ్స్ సిసిరీలియో, డిఓపి: సౌందర్ రాజన్, ఎడిటర్: తమ్మిరాజు, పిఆర్ఓ: వంశీ శేఖర్.