ఆగస్ట్ 31న “పేపర్ బాయ్”..

245
Paper Boy Release on August 31st
- Advertisement -

సంతోష్ శోభన్ హీరోగా ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్ గా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి ఎల్ ఎన్ సినిమా బ్యానర్స్ పై సంపత్ నంది, రాములు, వెంకట్, నర్సింహులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు, టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లై ని అందించడం విశేషం.ఇక ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఆగష్టు 23న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ‘పేపర్ బాయ్’ టైటిల్ సాంగ్ ని రచయిత కసర్ల శ్యాం రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో కథా రచయిత, నిర్మాత సంపత్ నంది, దర్శకుడు జయశంకర్, హీరో సంతోష్ శోభన్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసి రోలియో, నిర్మాతల్లో ఒకరైన నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

 Paper Boy

పాటల రచయిత కాసర్ల శ్యాం మాట్లాడుతూ ” – ఈరోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను.నేను రాసిన పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ ని నా చేత రిలీజ్ చేయించడం చాలా హ్యాపీగా వుంది. ఈ పాటని చంద్రబోస్ గారు ఆలపించడం గొప్ప వరంగా భావిస్తున్నాను. నేను ఏక లవ్య శిష్యుండ్ని ఆయనికి. ఆయన పాటలు వింటూ పెరిగిన వాడ్ని. సంపత్ నంది గారితో ప్రతి మీటింగ్ ఓ పండగలా జరిగింది. పోక్, మాస్, తెలంగాణ యాసలో పాటలు రాసె నాకు ఇలాంటి టైటిల్, మెలోడీ పాటలు రాసె ఛాన్స్ ఇచ్చిన సంపత్ గారికి నా థాంక్స్. నా శైలిని పూర్తిగా మార్చి నాతో పాటలు రాయించుకున్న భీమ్స్ కి నా ధన్యవాదాలు. పేపర్ బాయ్ వున్నంతకాలం ఈ టైటిల్ సాంగ్ గుర్తుంటుంది అని చంద్ర బోస్ గారు మెచ్చు కున్నారు అన్నారు.

సంగీతదర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ ” – చంద్రబోస్ గారి పాటలు విను అని సంపత్ నంది గారు నాకు కొన్ని వందలసార్లు చెప్పారు. మంచి మ్యూజిక్ చేయడానికి ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆయన్ని పాట పాడాలి అని అడగ్గానే స్టూడియోకి వచ్చి ఒకరోజు అంతా ఉండి టైటిల్ సాంగ్ పాడారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు”.

Paper Boy Release on August 31st

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “- పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ పాడిన చంద్రబోస్ గారికి నా థాంక్స్. ఈ సినిమా ఆగష్టు 31న విడుదల అవుతుంది. సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు”.

కతా రచయిత, నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ “- ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వాటి గురించి అందరూ పాజిటివ్ గానే రివ్యూస్ రాసారు. వారందరికీ ఫస్ట్ నా థాంక్స్. పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ ని కాసర్ల శ్యామ్ అద్భుతంగా రాసారు. పేపర్ బాయ్ వున్నంతకాలం ఈ పాట నిలిచిపోతుంది. చంద్రబోస్ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన రాసిన ‘మంచుకొండల్లోని’ నుండి నిన్నటి యెంత సక్కగున్నావే వరకు ఆయన పాటలంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటిది ఆయన మా సినిమా టైటిల్ సాంగ్ పాడటం చాలా హ్యాపీగా వుంది.బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు ముందు అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 7న కాకుండా ఆగస్టు 31న ఈ చిత్రాన్నివరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నాం.

ఈరోజు నుండి పేపర్ బాయ్ రోడ్ ట్రిప్ !!

ఈ సినిమా గురించి అందరికీ తెలియాలి. అందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నుండి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం.మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ప్రతి గ్రామం, ప్రతి టౌన్, ప్రతి సిటీ, ఇంటింటికి తిరిగి పేపర్ వేసి అందర్నీ కలవబోతున్నారు అన్నారు”.

- Advertisement -